ఎట్టకేలకు దర్శకధీరుడు రాజమౌళి గుడ్ న్యూస్ పంచారు. దీనితో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. రాజమౌళి… తను మరియు తన కుటుంబం కరోనా నుండి కోలుకున్నట్లు తెలియజేశారు. రెండు వారాలుగా రాజమౌళి హోమ్ కోరంటైన్ అవడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. ఇక రాజమౌళి కుటుంబ సభ్యులు అందరికి నేడు కరోనా టెస్టులు చేయగా నెగెటివ్ అని తేలింది. కాగ రాజమౌళి కుటుంబం కరోనా రోగులకు ప్లాస్మా దానం చేయాలని అనుకుంటున్నారు.
కాకపోతే రోగుల చికిత్సకు కావాల్సిన యాంటీ బాడీస్ డెవలప్ కావడానికి రెండు వారాల సమయం పడుతుందని డాక్టర్స్ సూచించారట. ఆ ఆ తర్వాత రాజమౌళి కుటుంబం ప్లాస్మా డొనేట్ చేయనున్నారు. ఇక కరోనా నుండి పూర్తి స్థాయిలో కోలుకున్న జక్కన్న ఆర్ ఆర్ ఆర్ మూవీపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. మరో ప్రక్క వచ్చే ఏడాది మాత్రమే షూటింగ్స్ మొదలవుతాయన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, చరణ్ అల్లూరి పాత్రలు చేస్తున్నారు.