Rajamouli, Sukumar: సుకుమార్‌కు ఓ రోజు రాజమౌళి ఫోన్‌ చేసి..

‘పుష్ప’ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు అంటే… ‘ఏంటి సుకుమార్‌.. రాజమౌళిని ఫాలో అవుతున్నారా?’ అని అనుకున్నారు. ఈ విషయంలో జక్కన్నను సుక్కు.. ఫాలో అయ్యారో లేదో తెలియదు కానీ… జక్కన్న చెప్పడం వల్లే ఈ సినిమా రెండు పార్టులుగా వస్తోంది. అవును ఈ విషయాన్ని సుకుమారే ఇటీవల చెప్పారు. రాజమౌళి మాటను వినే సినిమా రెండు పార్టులుగా తెరకెక్కించడానికి ఓకే అయ్యారట సుకుమార్‌. ఇంతకీ ఏమైందంటే. ‘పుష్ప’ చిత్రీకరణ మొదలైన తర్వాత…

ఈ సినిమా ఒక పార్టులో పూర్తవ్వడం కుదరదు అని చిత్రబృందం అనుకుందట. దీంతో సినిమాను రెండు పార్టులు తెరకెక్కించాలని ఫిక్స్‌ అయ్యారట. దాని కోసం కొన్ని రోజులు పని చేశారట. రెండు పార్టులకు తగ్గట్టుగా సినిమాలో చిన్నపాటి మార్పులు కూడా చేశారట. అయితే ఏమైందో ఏమో కానీ… సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో రెండు పార్టులుగా తెరకెక్కించడం అంత సరికాదని అనిపించిందట సుకుమార్‌కు. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కి చెప్పారట సుకుమార్‌.

ఆ మాట అటు తిరిగి, ఇటు తిరిగి జక్కన్న చెవిన పడిందట. దీంతో సుకుమార్‌కు జక్కన్న ఫోన్‌ చేసి ‘రెండు పార్టుల ఆలోచన నుండి వెనక్కి తప్పుకుంటున్నారనే విషయం తెలిసింది నిజమేనా?’ అని అడిగారట. దానికి సుకుమార్‌… అవును రెండు పార్టులు అవసరమా? చేయగలమా? అనిపించింది అని చెప్పారట. ఆ మాటలు విన్న జక్కన్న… ‘రెండు పార్టులు చేయండి. బాగుంటుంది సినిమా కథకు తగ్గట్టుగా, మీకు అవసరమైనట్లుగా చేయండి’ అని భరోసా ఇచ్చారట.

దీంతో సుకుమార్‌ మళ్లీ కథ మీద కూర్చొని, సినిమాను రెండు పార్టులకు తగ్గట్టుగా మలిచారట. అలా రెండు పార్టులు చేసిన సినిమానే ఇప్పుడు మనం చూశాం. అయితే సినిమాను చూసిన ప్రజలు కాస్త నిడివి తగ్గించి సినిమాను ఒక పార్టే చేస్తే బాగుండు కదా అని అంటున్నారు. సాగదీత సన్నివేశాలు, అనవసర కంటెంట్‌ లేకుండా ఒకే పార్టులో తీసుంటే సినిమా ఇంకాస్త బిగుతుగా అలరించేదిలా ఉండేది కదా అనే చర్చ కూడా సోషల్‌ మీడియాలో నడుస్తోంది. ఈ మాటలు సుకుమార్‌ చెవిన కచ్చితంగా పడతాయి. వాటికి ఏమన్నా సమాధానం ఇస్తారేమో చూడాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus