జూనియర్ ఎన్టీఆర్ లుక్ ని పూర్తిగా మార్చేసిన డైరెక్టర్ రాజమౌళి

డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న భారీ మల్టీస్టార్ ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభం అవ్వగా, హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో యాక్షన్ సీన్స్ ని తీస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వారి లుక్ ఎలా ఉంటుంది? ఇందులో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు ? సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఎప్పుడు వస్తుందో అని చాలా మంది అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూస్తుంటే డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్ ని పూర్తిగా మార్చేస్తాడేమో అని అనుకుంటున్నారు.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తాడని ఇదివరకే వార్తలు వినిపించగా, ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో ని చూస్తే జక్కన ఎన్టీఆర్ ని కొత్తగా చూపించబోతున్నాడనే అంటున్నారు. భారీకాయంతో, గుబురు గడ్డంతో ఎన్టీఆర్ గెటప్ ఉంటుందని, ‘అరవింద సమేత’ సినిమా కు సిక్స్ ప్యాక్ చేసిన ఎన్టీఆర్ కి శిక్షణ ఇచ్చిన లాయిడ్ స్టీవెన్స్ అనే సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్, ఎన్టీఆర్ భారీకాయుడిగా అయ్యేందుకు కూడా అతడే శిక్షణ ఇవ్వనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెగ్యులర్ లుక్ లోనే కనిపిస్తాడని ఎన్టీఆర్ లుక్ మాత్రం జక్కన్న పూర్తిగా మార్చేస్తునట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus