ఒక పదేళ్ల క్రితం వరకు సినిమాని ప్రమోట్ చేసిన తీరు వేరు. వీక్లీ మ్యాగజైన్స్ లో ఎక్స్క్లూజివ్ పోస్టర్స్ రిలీజ్ చేసేవారు, డైలీ పేపర్స్ కి సపరేట్ స్టిల్స్ ఉండేవి. వెబ్ సైట్స్ & సోషల్ మీడియా కంటెంట్ అనేది ఉండేది కాదు. అలాంటిది.. కరోనా తర్వాత ప్రమోషనల్ కంటెంట్ ఫార్మాట్ మారిపోయింది. సదరు సినిమా ఎప్పుడూ ట్రెండ్ లో ఉండడం కోసం డిజిటల్ టీమ్స్ పడే తంటాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ముఖ్యంగా.. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని రకరకాలుగా రివీల్ చేసేవారు. అది కాస్త ఓవర్ అయ్యి.. ఫలానా పాట/ట్రైలర్/టీజర్ ఎప్పడు రిలీజ్ అవుతుంది అనే అప్డేట్ కి సంబంధించిన అప్డేట్ తాలూకు టైమ్ అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నాం అనే అప్డేట్ కోసం ఇచ్చే అప్డేట్ రేపు అని పోస్టర్లు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. పోనీ ఇంత హడావుడి చేసి చెప్పిన టైమ్ కి అప్డేట్ ఇస్తారా అంటే కాదు.

అలాంటిది ఆ ఫార్మాట్ మొత్తాన్ని తుంగలో తొక్కి రాజమౌళి & టీమ్ ప్రమోషన్స్ కు గత వైభవాన్ని తీసుకొచ్చాడు. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న #SSMB29 సినిమా అప్డేట్స్ ను చాలా సింపుల్ గా రిలీజ్ చేస్తున్నారు. విలన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అని చెప్పి.. అదేరోజు పోస్టర్ రిలీజ్ చేశాడు. నవంబర్ 15న జరగబోయే ఈవెంట్ ను హాట్ స్టార్ కి అమ్మి.. మొదటి మెట్టులోనే ప్రపంచస్థాయి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.

ఇక.. నిన్న సంచారి పాటను కూడా ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ చేసి మహేష్ బాబు ఫ్యాన్స్ కు మంచి షాక్ ఇచ్చాడు. రాజమౌళి ఇదే ఫార్మాట్ ను సినిమా మొత్తానికి వాడితే బాగుంటుంది. ఎందుకంటే.. ఈ అప్డేట్స్ కోసం వెయిట్ చేయించడం కోసం టీమ్ పడే ఇబ్బందులతో సినిమాకి డ్యామేజ్ చేస్తున్నారు. #SSMB29 ప్రమోషన్స్ కి ఈ ఫార్మాట్ మంచిగా వర్కవుట్ అయితే.. ఇకమీదట అప్డేట్ తాలూకు అప్డేట్ గురించి అప్డేట్ లాంటివి ఉండబోవు.
