సంక్రాంతి బరిలో అందరికంటే ముందు నిలబడిన చిత్రం “రాజా సాబ్”. జనవరి 9న ఎట్టిపరిస్థితుల్లో వచ్చేస్తున్నాం అంటూ సినిమా యూనిట్ మొత్తం చాలా బలంగా చెబుతున్నారు. ఎప్పుడో రెండు నెలల ముందే టీజర్ & ట్రైలర్ ను రిలీజ్ చేసి నేషనల్ లెవల్లో సినిమాకి క్రేజ్ వచ్చేలా చేసిన చిత్రబృందం.. రిలీజ్ ఇంకా రెండు నెలలు కూడా లేని సమయంలో సైలెంట్ గా ఉండడం అనేది ప్రభాస్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తుంది.
Raja Saab
అందుకే ఓ రెండు రోజులు విశ్వప్రసాద్ & ఎస్.కే.ఎన్ మీద నెగిటివ్ ట్రెండ్ కూడా చేశారు. కట్ చేస్తే.. ఎస్.కే.ఎన్ రంగంలోకి దిగి ప్రభాస్ ఫ్యాన్స్ ను కూల్ చేయాల్సి వచ్చింది. అయితే.. ఒక ప్యాన్ ఇండియన్ సినిమాకి క్రియేట్ చేయాల్సిన బజ్ ను ఇంకా సరిగా చేయడం లేదు అనేది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. కనీసం ఈపాటికి ఒక పాట అయినా రిలీజ్ చేసి ఉండాల్సింది.
మరి తమన్ దగ్గర డిలే జరుగుతుందా? లేక అన్నీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయాలి కాబట్టి టీమ్ ఎక్కువ టైమ్ తీసుకుంటుందా? అనేది తెలియదు కానీ.. ఇలా డిలే చేయడం వల్ల ప్రాజెక్ట్ కి డ్యామేజ్ అవుతుంది అనే విషయం చిత్రబృందం గమనించాల్సి ఉంది.
మారుతి దర్శకత్వం, ముగ్గురు హీరోయిన్లు, హారర్ జోనర్, చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ కామెడీ చేయడం వంటి ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ.. రాజాసాబ్ టీమ్ ఎందుకో వాటిని సరిగా వినియోగించుకోవడం లేదు. టైటిల్ సాంగ్ ను నవంబర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు బృందం. డిలే లేకుండా త్వరగా రిలీజ్ చేస్తే.. ఆడియన్స్ సదరు పాటలతో వైబ్ అవుతూ సినిమాకి హైప్ పెంచుకుంటారు.. లేదంటే మాత్రం మిగతా సినిమాలు రాజాసాబ్ ను డామినేట్ చేయడం ఖాయం.