Rajamouli: హృతిక్ ను కించపరచాలని నేను అలా మాట్లాడలేదు… రాజమౌళి కామెంట్స్ వైరల్!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉండటం వల్ల రాజమౌళి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాజమౌళికి గతంలో ఈయన హృతిక్ రోషన్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

గతంలో రాజమౌళి ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సమయంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మాట్లాడుతూ ప్రభాస్ ముందు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నథింగ్ అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై తాజాగా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెబుతూ ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఘటన ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందో తెలియదు కానీ ఆ రోజు తాను హృతిక్ రోషన్ గురించి అలా మాట్లాడటం పూర్తిగా నా తప్పే.

అయితే నేను హృతిక్ రోషన్ ను ఉద్దేశిస్తూ ఆయనని కించపరచాలన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు మాట్లాడలేదని ఈ సందర్భంగా రాజమౌళి తన తప్పును అంగీకరించారు. ధూమ్ 2 వచ్చిన తర్వాత ఇలాంటి హీరోలు కేవలం బాలీవుడ్ లో మాత్రమే ఉన్నారా టాలీవుడ్ లో ఇలాంటి హృతిక్ రోషన్లు లేరా అని ఈయన బిల్లా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో మాట్లాడారు. అయితే బిల్లా సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ కూడా నథింగ్ అంటూ ఈయన కామెంట్స్ చేశారు.

అయితే తాజా ఇంటర్వ్యూలో తాను హృతిక్ రోషన్ అనడంలో తప్పు పదాలను ఎంపిక చేసుకున్నానంటూ ఈయన తన తప్పును అంగీకరించడంతో చాలామంది తప్పును అంగీకరించడానికి కూడా ఎంతో గొప్ప మనసు ఉండాలి. మీరు మరోసారి మీ వినయం చాటుకున్నారు అంటూ జక్కన్న పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus