Rajamouli: అదే పతనానికి నాంది అంటున్న రాజమౌళి!

తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాను అద్బుతంగా ప్రమోట్ చేసే డైరెక్టర్ గా స్టార్ డైరెక్టర్ రాజమౌళికి పేరుంది. నేషనల్ మీడియాను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రారంభానికి గల కారణాలను రాజమౌళి తాజాగా చెప్పుకొచ్చారు. ముంబైలో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ పై రాజమౌళి అంచనాలను మరింత పెంచుతున్నారు. నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న రాజమౌళి

నా సినిమాలో ఎవరైనా నటిస్తారని నేను ఏం చేసినా ఓకే చేస్తారని భావనను కలిగి ఉంటే అదే పతనానికి నాంది అవుతుందని కామెంట్లు చేశారు. అయితే అటువంటి ఆలోచన మాత్రం తన మనస్సులో లేదని రాజమౌళి అన్నారు. రెండు పవర్ ఫుల్ పాత్రలను తీసుకొని సినిమా చేయాలనే ఆలోచన బిగినింగ్ నుంచి ఉందని జక్కన్న చెప్పుకొచ్చారు. కృష్ణుడు అర్జునుడు, దుర్యోధనుడు కర్ణుడు స్నేహితులని మనందరికీ తెలుసని రాజమౌళి తెలిపారు.

అయితే దుర్యోధనుడు కృష్ణుడు ఫ్రెండ్స్ అయితే ఏ విధంగా ఉంటుందనేది తన ఆలోచన అని జక్కన్న చెప్పుకొచ్చారు. ఆ ఆలోచనలో ఆర్‌ఆర్‌ఆర్‌ పుట్టిందని తారక్, చరణ్ ఈ సినిమాలోని పాత్రలకు న్యాయం చేస్తారని అనిపించిందని రాజమౌళి అన్నారు. పెట్టిన డబ్బు రాకపోతే అది ఫెయిల్యూర్ గానే పరిగణించాలని రాజమౌళి చెప్పుకొచ్చారు. విడుదలైన తర్వాతే నంబర్స్ గురించి ఆలోచిస్తానని కలెక్షన్ల గురించి రాజమౌళి కామెంట్లు చేశారు. డబ్బు కోసమే సినిమాలు చేస్తామని డబ్బు రాకపోతే కష్టం వృథా అయినట్టేనని భావించాలని రాజమౌళి తెలిపారు.

నాటు నాటు పాటలో ఎమోషన్ ఉంటుందని సినిమా రిలీజైన తర్వాత ఆ విషయం ప్రేక్షకులకు అర్థమవుతుందని జక్కన్న అన్నారు. ఎమోషన్స్ ఉంటే సీన్ పండుతుందని తాను నమ్ముతానని జక్కన్న అన్నారు. తను ఊహించినట్టుగా సీన్ రాకపోతే భయపడతానని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు అంచనాలను మించి ఖర్చైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus