స్టార్ డైరెక్టర్ రాజమౌళి వరుసగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈగ, బాహుబలి, బాహుబలి2 సినిమాలతో విజయాలను అందుకున్న రాజమౌళి తాజాగా ఒక సందర్భంలో పాన్ ఇండియా సినిమాల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడితే భారీ బడ్జెట్ తో తెరకెక్కితే పాన్ ఇండియా మూవీ అవుతుందా? వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటే పాన్ ఇండియా మూవీ అవుతుందా? అనే సందేహం చాలామందికి ఉందని రాజమౌళి అన్నారు.
భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులకు అర్థమవుతుందంటే ఆ సినిమా పాన్ ఇండియా సినిమా అని రాజమౌళి చెప్పుకొచ్చారు. తాను బాహుబలి సినిమాను తెరకెక్కించినా నా సినిమాల పరంగా నేను ఏ సినిమా పాన్ ఇండియా మూవీ అవుతుందో చెప్పగలనని జక్కన్న తెలిపారు. బ్రహ్మాస్త్ర రషెస్ చూసిన సమయంలో హిందీ రాకపోయినా తనకు అర్థమైందని రాజమౌళి అన్నారు. చాలామంది ఈ తరహా సినిమాల్లో సక్సెస్ కారని కానీ బ్రహ్మాస్త్ర సీక్వెన్స్ లు చూసిన తర్వాత
ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నానని జక్కన్న పేర్కొన్నారు. పాన్ ఇండియా సినిమాలపై జక్కన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో పదుల సంఖ్యలో సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. అయితే చాలామంది దర్శకులు కథను పట్టించుకోకుండా బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి. తాజాగా పుష్ప పార్ట్1 పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాగా
తెలుగులో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ఇతర భాషల్లో మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర భాషల్లో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎంతమంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సాధిస్తారో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!