Rajamouli, Rajanikanth: కోలీవుడ్ హీరో అంటే జక్కన్నకు ఇంత అభిమానమా?

దర్శకధీరుడు రాజమౌళి తన సినీ కెరీర్ లో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కించారు. జక్కన్న సినిమాలు అంటే రిస్కీ షాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం వల్లే ఆయన యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో ఎక్కువ సినిమాలను తెరకెక్కించారు. అదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలతో పని చేయడానికే జక్కన్న ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లతో రాజమౌళి ఎక్కువ సినిమాలను తెరకెక్కించారు.

బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలవడంతో భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం జక్కన్న పేరు మారుమ్రోగుతోంది. అయితే స్టార్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా రజనీకాంత్ సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందంటూ తన మనస్సులోని కోరికను వెల్లడించడం గమనార్హం. రాజమౌళి అడిగితే రజనీకాంత్ డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. రాజమౌళి రజనీకాంత్ తో మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి రాజమౌళి ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.

జక్కన్న భవిష్యత్ ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రాజమౌళి ఈ ప్రాజెక్ట్ తో కూడా మరో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిసున్నాయి. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

మహేష్ ఈ సినిమా కోసం రెండేళ్ల సమయం అయినా కేటాయించడానికి సిద్ధమేనని వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న హీరోల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. అయితే రాజమౌళి మాత్రం కోలీవుడ్ స్టార్ హీరోను డైరెక్ట్ చేయడానికి ఆసక్తి చూపించడం గమనార్హం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus