‘బిల్లా’ చూశాక హృతిక్ ఎందుకు పనిచేయడు అనిపిస్తుంది.. వైరలవుతున్న రాజమౌళి పాత వీడియో..!

స్టార్ హీరోల పుట్టినరోజుల సందర్భంగా ఈ మధ్యన వారి పాత సినిమాల పాత ప్రింట్ లను 4K వెర్షన్ కు అప్డేట్ చేసి రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు అలా రీ రిలీజ్ అయ్యాయి. ఇదే క్రమంలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘బిల్లా’ సినిమాని 4K వెర్షన్‌లో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇది ప్రభాస్ కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీ కాదు.

కానీ విజువల్స్ పరంగా, ప్రభాస్ లుక్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, అనుష్క గ్లామర్ పరంగా ప్రభాస్ అభిమానులకు కావాల్సిన ఫ్యాన్స్ స్టఫ్ ను అందించింది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు.ఆయన తెరకెక్కించిన సినిమాల్లో ది బెస్ట్ ఇదే. కానీ రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం వలనో లేక ఆ టైంలో ప్రమోషన్స్ లోపం వల్లనో కానీ ఈ సినిమా ఎబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. కానీ ఈ చిత్రం సూపర్ గా వచ్చింది అన్న విషయాన్ని ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి ‘బిల్లా’ రిలీజ్ టైంలోనే చాలా గొప్పగా చెప్పాడు.

అందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో రాజమౌళి మాట్లాడుతూ.. ‘రెండు మూడు సంవత్సరాల క్రితం ‘ధూమ్ -2’ హిందీలో రిలీజ్ అయినప్పుడు.. ‘వాళ్ళకే అంత క్వాలిటీ ఎందుకు వస్తుంది. హృతిక్ రోషన్ లా మనకి హీరోలు లేరా? అలాంటి హీరోలతో మనం సినిమాలు చేయలేమా. అలా మనం ఎందుకు తీయలేకపోతున్నాం అని చాలా బాధగా ఉండేదండి.

జస్ట్ 2 డేస్ బ్యాక్ మెహర్ రమేష్ గారు ‘బిల్లా’ లో ఓ సాంగ్ చూపించారు, బిల్లా పోస్టర్స్ డిజైన్ చూపించారు, ఇప్పుడు ట్రైలర్ చూశాం. ఒక్కటే మాట అండి.. హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు. తెలుగు సినిమాని బాలీవుడ్ లెవెల్ దాటి హాలీవుడ్ లెవల్లో నిలబెట్టిన మెహర్ రమేష్ గారికి స్పెషల్ థాంక్స్’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రాజమౌళి చెప్పిన ఈ విషయాలు అన్నీ ‘బాహుబలి’ తో నిజమయ్యాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus