Rajamouli: రాజమౌళి సందీప్ వంగాను ఆ డైరెక్టర్ తో పోల్చిశారా..!

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం మొత్తానికి చాటిచెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన దర్శకత్వంలో విడుదలైన అన్ని సినిమాలు కూడా ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వడమే కాకుండా ప్రతి ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఇటీవలే విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని నెలలు పూర్తి అవుతున్నా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు. అయితే రణ్‌బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్..

ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కు డైరెక్టర్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈవెంట్ లో దర్శక దీరుడు రాజమౌళి యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ఆయన మాట్లాడుతూ ‘ప్రతి సంవత్సరం కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తారు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. ఎంతగానో పేరు సంపాదిస్తారు. దానిని మనం చూస్తూనే ఉంటాము. కానీ సినిమా అంటే ఇలానే తీయాలి అనే డైరెక్టర్స్ అప్పుడప్పుడు వస్తూ వుంటారు. అలాంటి డైరెక్టర్స్ నా తరం లో వచ్చిన వ్యక్తి రాం గోపాల్ వర్మ..ఇప్పుడు ఈ జనరేషన్ లో అలాంటి డైరెక్టర్ మాత్రం సందీప్ రెడ్డి వంగా’ అంటూ దర్శకుడు సందీప్ ను ఎంతగానో మెచ్చుకున్నారు.

రాజమౌళి (Rajamouli) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండ్రస్టీలో వైరల్ గా మారాయి. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్ మరియు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ సినిమాలో అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో నటించగా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. సందీప్ ఈ సినిమాను వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.డిసెంబర్ 1 న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus