గత వారం విడుదలైన ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీపై మొదట్లో భారీ ఆసక్తి కనిపించినా, విడుదల తర్వాత ఆ ఊపు తగ్గిపోయింది. రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఈ డాక్యుమెంటరీ, ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా వెనుక ఉన్న కష్టాలు, అద్భుతమైన మేకింగ్ విశేషాలను ఆవిష్కరించడమే లక్ష్యంగా రూపొందించబడింది. అయితే, థియేట్రికల్ విడుదలలో ఇది ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఈ డాక్యుమెంటరీ గురించి పెద్దగా ప్రమోషన్ చేయకపోవడం కారణంగా చాలా మంది ప్రేక్షకులు దీని గురించి తెలుసుకోలేదు.
మరోవైపు, ఒక డాక్యుమెంటరీని థియేటర్స్‌లో చూడాలంటే ప్రేక్షకులకి తగినంత కారణం ఉండాలి. కానీ, ఎక్కువ మంది దీన్ని ఓటిటి కంటెంట్‌గా భావించి థియేటర్లకు వెళ్లే ఉత్సాహం చూపలేదు. ముఖ్యమైన పట్టణాలు, సెంటర్స్ లోనే పరిమిత స్క్రీన్లలో విడుదల చేయడం వల్ల ఈ డాక్యుమెంటరీ ఎక్కువ ప్రజలకు అందలేదు. కొన్ని చూడవలసిన అసలు విశేషాలు ఉన్నప్పటికీ, వాటిని థియేటర్లలో చూసే ఆసక్తి ప్రేక్షకుల్లో కుదిరినట్లు కనిపించలేదు.
డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో చరణ్ ఇంట్రో పోలీస్ స్టేషన్ ఫైట్, తారక్ పులి ఎపిసోడ్, నాటు నాటు సాంగ్ షూటింగ్ విశేషాలు, ఇంటర్వెల్ బాంగ్ సన్నివేశం, క్లైమాక్స్ సీన్‌లు వెనుక కష్టాలు వంటి విషయాలను కవర్ చేశారు. అయితే వీటిని థియేటర్లలో కంటే ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో చూడాలని ప్రేక్షకులు భావించారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అయితే కొన్ని చోట్ల జనాలు లేక మొదటి వీకెండ్ లోనే షోలు క్యాన్సిల్ చేసుకున్నారట. మినిమమ్ ఖర్చులు కూడా రాలేధని టాక్. రాజమౌళి ప్రమేయం లేకుండా ఇది థియేటర్స్ లోకి వచ్చి ఉండదు.
ఇక ఏదేమైనా థియేట్రికల్ పరంగా ఈ డాక్యుమెంటరీ రాజమౌళి కి డిజాస్టర్ రిజల్ట్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీని త్వరగా ఓటిటి లో విడుదల చేస్తే మాత్రం ఇది బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. చరణ్ (Ram Charan) , తారక్ (Jr NTR) అభిమానులు ఈ చిత్రానికి సంబంధించిన అన్‌సీన్ ఫుటేజ్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సమయంలో ఓటిటి విడుదల ఉంటే, రాజమౌళి మరోసారి ప్రేక్షకుల ప్రశంసలను అందుకునే అవకాశం ఉంది. ఈ డాక్యుమెంటరీని బాగా ప్రెజెంట్ చేసినప్పటికీ, థియేట్రికల్ ఫలితాలు రాజమౌళికి ఒక డిజాస్టర్ షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు.