Simhadri: అభిమానులతో కలసి సింహాద్రి సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి ఫ్యామిలీ!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.ఒక హీరో పుట్టినరోజు వస్తుంది అంటే ఆ హీరో సినిమాలను తిరిగి థియేటర్లలో విడుదల చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరి సినిమాలు తిరిగి విడుదలై ఊహించని విధంగా కలెక్షన్లను సాధించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మే 20వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సింహాద్రి సినిమాని 4కె వెర్షన్లు విడుదల చేశారు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1140 థియేటర్లలో విడుదల కావడం విశేషం. ఇన్ని థియేటర్లలో ఒక రీ రిలీజ్ సినిమా విడుదల అయ్యింది అంటే ఇదొక రికార్డు అని చెప్పాలి. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి థియేటర్ ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు పెట్టడం గమనార్హం. ఇక ఈ సినిమా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విషయం మనకు తెలిసిన సుమారు 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ అదే స్థాయిలో ప్రేక్షకు ఆదరణ పొందుతుంది అంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే.

ఇక  (Simhadri) ఈ సినిమా తిరిగి రిలీజ్ కావడంతో రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ అభిమానులతో కలిసి సింహాద్రి సినిమాని చూస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 70MM థియేటర్లో ఎన్టీఆర్ అభిమానులతో కలిసి రాజమౌళి కుటుంబం సినిమాని ఎంజాయ్ చేశారు.

ఇందులో భాగంగా రమ రాజమౌళి, వల్లి, కార్తికేయ, కాలభైరవ ఎన్టీఆర్ అభిమానులతో కలిసి సింహాద్రి సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అన్నిచోట్ల అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ రీ రిలీజ్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేయబోతుందని తెలుస్తోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus