‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌పై మరో ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌

టాలీవుడ్‌, బాలీవుడ్‌… ఇలా ఏ వుడ్‌ అయినా మ్యాగ్జిమమ్‌ కొత్త సినిమా రిలీజ్‌ వీకెండ్‌లో ఉంటుంది. వీకెండ్‌ అంటే శుక్రవారమే రిలీజ్‌ చేస్తుంటారు. వారాంతంలో సినిమాలకు వసూళ్లు బాగుంటాయి, సినిమా టాక్‌ను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఓపెనింగ్‌ వసూళ్లు ఉపయోగపడతాయని ఆ రోజు విడుదల చేస్తుంటారని సినిమా విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఆ సంప్రదాయాన్ని బ్రేక్‌ చేసి ‘బుధవారం’ సినిమాలు విడుదల చేసేలా మెగా కుటుంబం చాలా రోజుల నుంచి సినిమాలు విడుదల చేస్తూ వస్తోంది. ఓపెనింగ్స్‌ స్పాన్‌ను పెంచుకోవడమే దాని వెనుక ఉద్దేశం. ఆ తర్వాత కొంతమంది బుధవారం రిలీజ్‌ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు రాజమౌళి కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో అదే సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నాడు.

రాజమౌళి నుంచి రాబోతున్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లాంటి అగ్ర హీరోలతో సినిమా తీస్తుండటంతో దీని మీద భారీ అంచనాలే ఉన్నాయి. జక్కన్న గత చిత్రాలు ‘బాహుబలి’ 1 & 2 కంటే దీని మీద ఎక్కువ అంచనాలు పెరుగుతున్నాయి. బాలీవుడ్‌ నటుల్ని కూడా ఇందులోకి తీసుకొని స్పాన్‌ పెంచేశాడు జక్కన్న. వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు విజయదశమిని పురస్కరించుకుని అక్టోబరు 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజు బుధవారం. మామూలుగా రాజమౌళి సినిమాలు శుక్రవారమే విడుదలవుతుంటాయి. రెండు బాహుబలులు ఆ రోజే వచ్చాయి. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో మెగా లాజిక్‌కే ఓటేశాడు.

నిజానికి సినిమాను అక్టోబరు 8న విడుదల చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. అయితే విడుదలను 13కు వాయిదా వేశారు. బాండ్‌ సినిమాతో పోటీ ఎందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇక సినిమా షూటింగ్‌ మేజర్‌ పార్ట్‌ పూర్తయినట్లు చెబుతున్నారు. క్లైమాక్స్‌ ప్రస్తుతం షూట్‌ చేస్తున్నారు. అయితే రాజమౌళి సినిమాలు షూటింగ్‌లో కంటే… పోస్ట్‌ ప్రొడక్షన్‌లోనే ఎక్కువ రోజులు ఉంటాయి. కాబట్టి అంత టైమ్‌ తీసుకుంటున్నారట. పోనీలేండి ఏ రోజు అయితే ఏముంది… సినిమా విడుదలవ్వాలి. బాక్సాఫీసులు నిండాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus