Rajamouli: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన రాజమౌళి కానీ..!

  • March 11, 2023 / 01:10 PM IST

రాజమౌళి ‘ఆస్కార్’ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి విదేశాలకు వెళ్తున్నారు. చరణ్ – ఎన్టీఆర్ లు ఎలాగూ విదేశాల్లోనే గడుపుతున్న సంగతి తెలిసిందే. గత 6,7 నెలల నుండి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విదేశాల్లో ఏదో ఒక ప్రదేశంలో రిలీజ్ అవుతూ ఉండటం… అక్కడ టీంతో కలిసి వెళ్లి ప్రమోషన్ చేయడం వంటివి రాజమౌళి చేస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలకు కూడా రాజమౌళి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.

‘ఆస్కార్’ ప్రమోషన్స్ అయిపోగానే రాజమౌళి కొన్నాళ్ల పాటు రిలాక్స్ అవుదామనుకుంటున్నాడు. తర్వాత మహేష్ సినిమా పనులు మొదలుపెట్టాలని అతను భావిస్తున్నాడు. ఇంతలోనే అతని ఆలోచన మళ్ళీ మారినట్టు తెలుస్తోంది. రాజమౌళి ఎన్నికల ప్రచారంలో బిజీ కావాలని భావిస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు రాజమౌళితో ప్రచారం చేయించుకోవాలని చూస్తున్నారు. అయితే ఇది తెలుగు రాష్ట్రల్లో కాదు. కర్ణాటకలో కావడం గమనార్హం. రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళిని నిర్మించినట్టు ఆ జిల్లాకి పాలనాధికారి అయిన చంద్రశేఖర్‌ నాయక్‌ వెల్లడించారు.

థియేటర్లు హౌస్ ఫుల్ చేసినట్టు రాబోయే ఎన్నికల్లో జనాల్లో చైతన్యం నింపి బ్యాలెట్ బాక్సులు కూడా ఫుల్ అయ్యేలా చేస్తాడని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాజమౌళి పేరు సిఫార్సు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆల్రెడీ ఈ విషయమై రాజమౌళితో డిస్కస్ చేయడం ఆయన ఓకే చెప్పడం జరిగిందట. రాయచూరు జిల్లా మాన్వి ,అమరేశ్వర క్యాంపులో రాజమౌళి జన్మించిన సంగతి తెలిసిందే.

ఆయన పుట్టిన గడ్డ పై ఓటింగ్ శాతం పెంచేందుకు రాజమౌళి తన వంతు కృషి చేయనున్నారన్న మాట. రాజమౌళికి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని గతంలో ప్రూవ్ అయ్యింది. లోక్ సత్తా పార్టీ తరఫున ఆయన జయప్రకాశ్ నారాయణ తో కలిసి పని చేశారు. కానీ పక్క రాష్ట్రాల రాజకీయాల్లో రాజమౌళి పనిచేయడం అనేది ఇదే మొదటిసారి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus