Rajamouli, Prabhas: ప్రభాస్ తో సినిమాపై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో ఛత్రపతి, బాహుబలి, బాహుబలి2 సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వార్తల గురించి రాజమౌళి స్పష్టతనిచ్చారు. ఒక కాలేజ్ ఈవెంట్ కు హాజరైన జక్కన్న రూమర్లకు చెక్ చెప్పారు.

ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే. మరో నాలుగేళ్ల వరకు ప్రభాస్ రెస్ట్ లేకుండా సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. తెలుగులో ఏ స్టార్ హీరో కూడా ప్రభాస్ స్థాయిలో బిజీగా లేరు. జక్కన్న సైతం ప్రభాస్ తో పని చేసే ఛాన్స్ తనకు ఎప్పటికి వస్తుందో? అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ప్రభాస్ చేతినిండా సినిమాలు ఉన్నాయని ప్రభాస్ తో మరో సినిమా ప్రకటన కష్టమేనని ప్రచారం జరుగుతోంది.

బుజ్జిగాడు సినిమాలో నటించిన తర్వాత ప్రభాస్ నటుడిగా చాలా మారాడని జక్కన్న తెలిపారు. ప్రభాస్ లో వచ్చిన మార్పు విషయంలో క్రెడిట్ పూర్తిస్థాయిలో పూరీ జగన్నాథ్ కు దక్కుతుందని జక్కన్న చెప్పుకొచ్చారు. రవితేజ, మహేష్, ఎన్టీఆర్, పవన్ లను మాస్ ఫ్యాన్స్ కు దగ్గర చేసిన ఘనత కూడా పూరీ జగన్నాథ్ కు చెందుతుందని జక్కన్న వెల్లడించారు. రాజమౌళి తోటి డైరెక్టర్ అయిన పూరీ జగన్నాథ్ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేయడం గమనార్హం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus