Rajamouli: అలా అడగటం రాజమౌళికి నచ్చలేదా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సినిమాసినిమాకు దర్శకుడిగా రాజమౌళి తన స్థాయిని పెంచుకుంటున్నారు. బాహుబలి సిరీస్ సినిమాలతో రాజమౌళికి ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమాకు 1,000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కథనంతో మ్యాజిక్ చేస్తూ రాజమౌళి విజయాలను అందుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలను ఇస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందే తన సినిమా కథను చెప్పేసే రాజమౌళి ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో చాలా అంశాలను రివీల్ చేసేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఏ విధంగా ఉండబోతుందో ప్రేక్షకులకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే మీడియా మీట్స్ లో కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు మాత్రం ఆయనకు చిరాకు తెప్పించాయి.

ఆర్ఆర్ఆర్ కథ గురించి చెప్పాలని, ఎన్టీఆర్ ముస్లిం క్యాప్ ధరించడానికి కారణాలు చెప్పాలని చరణ్ అల్లూరి సీతారామరాజు అయితే నాటు నాటు పాటకు ఎందుకు స్టెప్పులు వేశారని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు రాజమౌళి స్పందిస్తూ ప్రపంచంలో ఎవరూ ట్రైలర్ ద్వారా మొత్తం కథ చెప్పరని తాను కథ రివీల్ చేసినా ఇంకా కథ గురించి ప్రశ్నలు అడుగుతున్నారని మొత్తం స్క్రిప్ట్ పంపమంటారా అంటూ ఘాటుగా స్పందించారు.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాపై ఇప్పటికే భారీస్థాయిలో అంచనాలు పెంచేశారు. ఆర్ఆర్ఆర్ కథ గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సైతం చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ పాటలే కావడం గమనార్హం. సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ మాత్రం పాల్గొనకపోవడం గమనార్హం. జక్కన్న, రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ ప్రమోషన్స్ ద్వారా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేస్తున్నారు. బాహుబలి2 రికార్డులు ఆర్ఆర్ఆర్ మూవీతో బ్రేక్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus