Rajamouli: పేద పిల్లల కోసం రాజమౌళి అలా చేస్తున్నారా.. గ్రేట్ అంటూ?

  • June 13, 2023 / 12:27 PM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు. రాజమౌళి సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో ఆయనకు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతోంది. తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాతో జక్కన్న దర్శకునిగా క్రేజ్ ను మరింత పెంచుకోవడంతో పాటు అంతకంతకూ ఎదుగుతున్నారు. అయితే మంత్రి హరీష్ రావు తాజాగా ఒక సందర్భంలో రాజమౌళి గొప్పదనం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

లిటిల్ స్టార్స్ అండ్ షీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజమౌళితో పాటు హరీష్ రావు హాజరయ్యారు. బాహుబలి సిరీస్ సినిమాలతో రాజమౌళి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇమడింపజేశాడని హరీష్ రావు వెల్లడించారు. ఆర్.ఆర్.ఆర్ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ప్రజల ఖ్యాతిని రాజమౌళి నిలబెట్టారని ఆయన పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత రాజమౌళిని ఇప్పుడే కలిశానని ఆయన పేర్కొన్నారు.

రాజమౌళి తండ్రిగారిని చాలాసార్లు కలిశానని హరీష్ రావు అన్నారు. విజయేంద్ర ప్రసాద్ చాలా సింపుల్ గా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఒక క్యాన్సర్ ఆస్పత్రిలో కొత్తగా బ్లాక్ కడితే జక్కన్న ఫ్యామిలీ శానిటేషన్ బాధ్యతలు తీసుకుందని ఆయన తెలిపారు. రాజమౌళి సైతం చిన్నపిల్లలకు, ఆపదలో ఉన్న పిల్లలకు డాక్టర్ సతీష్ ద్వారా సాయం చేస్తారని హరీష్ రావు అన్నారు. రాజమౌళి కూతురుకు సేవా గుణం ఉందని ఆయన తెలిపారు.

రాజమౌళి (Rajamouli) సినిమాలలో అంతర్లీనంగా మెసేజ్ ఉంటుందని హరీష్ రావు అన్నారు. రాజమౌళి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని కోరుకుంటున్నానని ఆయన కామెంట్లు చేశారు. హరీష్ రావు చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus