ఆంధ్రప్రదేశ్ లో ఇంకా టికెట్ రేట్ల గొడవ ఓ కొలిక్కి రాలేదు. మీడియం రేంజ్ సినిమాలు అన్నీ రిలీజై హిట్ అవుతున్నా.. అక్కడ మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోతున్నాయి. ఇటీవల కాలంలో వచ్చి హిట్ అయిన ‘లవ్ స్ట్రోరి’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాలు అక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు. ఏపి ప్రభుత్వం కూడా టాలీవుడ్ పై పగతీర్చుకోవడమే పనిగా.. పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అయినప్పటికీ వరుసగా పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లను ప్రకటించేస్తున్న నిర్మాతలు గుండెల్లో ఇప్పుడు రైళ్ళు పరిగెడుతున్నాయి.
ముఖ్యంగా ఇప్పుడు అందరి చూపు ‘ఆర్.ఆర్.ఆర్’ పైనే ఉంది. జనవరి టైంకి ఏపీ లో టికెట్ రేట్ల హైక్ లకి అనుమతి లభిస్తుందని సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆ సినిమాని విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సమస్య తీరేలా కనిపించడం లేదు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఉన్న ఓ భయం మాత్రం తొలగిపోయింది. మొన్నటి వరకు హిందీ మార్కెట్ కోలుకోలేదు. అక్కడ విడుదలైన సినిమాలను జనాలు పట్టించుకోవడం లేదు అనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే దీపావళి కానుకగా విడుదలైన అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ చిత్రం సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా జనాలని థియేటర్లకు రప్పించింది. ఈ చిత్రం అక్కడ రూ.120 కోట్ల పైన వసూళ్ళని సాధించింది. దాంతో రాజమౌళికి కొంత రిలీఫ్ దక్కినట్టు అయ్యింది. ‘ఆర్.ఆర్.ఆర్’ ను ఇప్పుడు ఎటువంటి భయాలు లేకుండా బాలీవుడ్లో రిలీజ్ చేసుకోవచ్చు. ‘సూర్యవంశీ’ కలెక్ట్ చేసిన దానికి 5 రెట్లు ‘ఆర్.ఆర్.ఆర్’ అక్కడ కలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ పండితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!