రాజమౌళి – మహేష్‌బాబు సినిమా గురించి ప్రతి వారం ఏదో ఒక కొత్త పుకారు వస్తూ ఉంటుంది. ఆ సినిమాలో మహేష్ పాత్ర అలా ఉంటుంది, రచయిత విజయేంద్ర ప్రసాద్ అదిరిపోయేలా రాశారు, ఇంటర్వెల్ బ్యాంగ్ భలేగా ఉంటుంది, రాజమౌళి అదిరిపోయే ఎమోషన్ సిద్ధం చేశారు అంటూ.. కొత్త కొత్త పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే సినిమా కథ అంతవరకు రాలేదట. ఎందుకంటే సినిమా కథపై విజేయంద్రప్రసాద్, రాజమౌళి ఆలోచనలు ఇంకా సాగుతూనే ఉన్నాయట.
ప్రతిష్ఠాత్మక గవర్నర్ అవార్డ్స్ కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యారు. ఈ సంద్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతోపాటు, మహేష్‌బాబు సినిమా గురించి మాట్లాడారు రాజమౌళి. ఈ సందర్భంగానే మహేష్ సినిమా ఎంతవరకు వచ్చింది అనే విషయం చెప్పారు. ‘‘కొన్ని నెలల క్రితమే మహేష్ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ రాయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం నేను, నాన్న కథను డెవలప్‌మెంట్ పనుల్లో బిజీగా ఉన్నాం. ముందుగా చెప్పినట్లు ఇదొక అడ్వెంచర్ కథ’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి.
దాంతోపాటు ‘‘ఇలాంటి జోనర్‌లో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ‘ఇండియానా జోన్స్’ సినిమా నాకు బాగా ఇష్టం. ఇప్పుడు మహేష్ సినిమా ఆ జోనర్‌లోనే ఉంటుంది’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ‘‘ప్రస్తుతానికి సినిమా కథ గురించి ఇంతకుమించి చెప్పలేను. ఇండియానా జోన్స్ తరహా క్యారెక్టర్‌లో మహేష్ బాబు కనిపిస్తాడని మాత్రం చెప్పగలను’’ అని జక్కన్న చెప్పారు. దీని వల్ల కథ ఇంకా రెడీ కాలేదని చెప్పడం ఒకటైతే.. మహేష్ సినిమా గురించి వస్తున్న పుకార్లను నమ్మొద్దు అని మరో మాట.
చాలా రోజుల క్రితమే రాజమౌళి ఈ సినిమా గురించి ఈ విషయాలు చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా కథ మారుతోందని, రెండు మూడు కథలు అనుకుంటున్నారని వార్తలొచ్చాయి. జేమ్స్ బాండ్ తరహా కథను కూడా అనుకుంటున్నారని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు రాజమౌళి మాటలు చూస్తుంటే.. ముందుగా చెప్పిన ‘ఇండియానా జోన్స్’ కథే సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!