తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న వారిలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అపజయం ఎరుగని సినిమాలే అని చెప్పాలి ఈయన సినిమాల వల్ల నష్టపోయిన నిర్మాతలు కూడా ఎవరూ లేరని చెప్పవచ్చు. ఇలా వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించే రాజమౌళి సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాల గురించి మాట్లాడుతూ తాను సినిమా చేస్తున్నాను
అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేస్తానని ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సినిమా ఎంత వసూలను రాబడుతుందని ముందుగా సినిమా వసూళ్లను లక్ష్యంగా చేసుకొని సినిమాలు చేస్తానని ఈయన తెలిపారు.ఒక సినిమాని ఎప్పుడూ నేను అవార్డులు, పురస్కారాలు ఆశించి చేయనని కేవలం డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేస్తానని చెప్పారు. తన దర్శకత్వంలో వచ్చిన సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన తర్వాత ఆ సినిమాకు అవార్డులు రివార్డులు వస్తే అది అదనపు ఫలితం అనుకుంటానని జక్కన్న తెలిపారు.
నేను చేసే సినిమా జనాలకు నచ్చాలి.. ఆ సినిమా భారీ వసూలను రాబట్టాలి అదే తన ప్రధాన లక్ష్యమని ఈయన తెలియజేశారు.ఇక సినిమా విషయంలో ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకొని చేసినప్పుడే సక్సెస్ సాధించగలరని జక్కన్న విశ్వసిస్తారు. ఒక సినిమా చేయాలంటే కొన్ని వందల కోట్ల బడ్జెట్ కేటాయించాలి అలాంటి సమయంలో సినిమాకు కలెక్షన్లు మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలి లేకపోతే సినిమాకు బడ్జెట్ పెట్టిన నిర్మాత రోడ్డున పడతారు
ఇలా ఇప్పటికే ఎంతోమంది నిర్మాతలు ఇండస్ట్రీకి కనుమరుగైపోయారు. అలాంటి పరిస్థితి తన నిర్మాతలకు రాకూడదన్న ఉద్దేశంతోనే రాజమౌళి ఇలాంటి సూత్రాలు ఫాలో అవుతున్నారనే చెప్పాలి ఏది ఏమైనా డబ్బు కోసమే సినిమాలు చేస్తానంటూ జక్కన్న కుండ బద్దలు కొట్టినట్లు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?