రాజమౌళి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

అపజయం అనే మాట ఇష్టపడని డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన దర్శకుడిగా తెలుగు చిత్ర సీమలో అడ్డుపెట్టి నేటికి (సెప్టెంబర్ 27) 15 సంవత్సరాలు. ఇన్ని ఏళ్లలో 10 చిత్రాలు మాత్రమే తెరకెక్కించారు. అయినా ఒక్కొక్కటి ఒక్కో కళాఖండం. సినిమాకు సినిమాకు టెక్నీకల్ గా అభివృద్ధి చెందుతూ బాహుబలితో తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చాటారు. ఆ దర్శకధీరుడి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు…

1. జన్మస్థలంప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కె.వి.విజయేంద్ర ప్రసాద్ స్వస్థలం కొవ్వూరు అయినా కొంతకాలం కర్ణాటకలోని రాయచూర్ లో జీవనం కొనసాగించారు. అక్కడే 1973 లో విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు రాజమౌళి జన్మించారు.

2. ఇంజినీర్జక్కన్న ఏలూరు లోని సీఆర్ఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. డబ్బులు లేక పై చదువులు చదవలేక పోయారు. దీంతో పని కోసం సినీ పరిశ్రమ వైపు వచ్చారు.

3. ఎడిటర్ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరావు వద్ద అసిస్టెంట్ ఎడిటర్ గా రాజమౌళి చేరారు. అయన వద్ద దాదాపు పదేళ్లు పనిచేశారు. అప్పుడే ఫిల్మ్ మేకింగ్ పై అవగాహన ఏర్పడింది.

4. బుల్లి తెర టు బిగ్ స్క్రీన్ప్రముఖ నటుడు రంగనాథ్ ప్రధాన పాత్రలో రూపొందిన “శాంతినివాసం” సీరియల్ కి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ ధారావాహిక ఈటీవీ లో ప్రసారమై మంచి రేటింగ్ వచ్చింది.

5. స్టూడెంట్ no1దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసిన రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ no1 చిత్రం ద్వారా డైరక్టర్ గా పరిచయమయ్యారు. ఈ సినిమా 2001 లో రిలీజ్ అయి బిగ్ హిట్ అయింది.

6. మగధీరజక్కన్నను దర్శక ధీరుడిని చేసిన చిత్రం మగధీర. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది. రెండు జాతీయ అవార్డులతో పాటు, 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది.

7. హోస్ట్హిట్ దర్శకుడిగా బిజీగా ఉన్న సమయంలోనే జక్కన్న తెలుగు న్యూస్ ఛానల్ హెచ్ఎంటీవీ లో “కమాన్ ఇండియా” షోకి హోస్ట్ గా వ్యవహరించారు. ఈ షో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

8. టెన్ టు టెన్రాజమౌళి తీసే చిత్రాలపై ఇతర రాష్ట్రాల సినీ ప్రముఖుల కన్ను ఉంటుంది. నచ్చితే డబ్బింగ్, బాగా నచ్చితే రీమేక్ చేయడం పక్క రాష్ట్రాల వారికీ అలవాటు. అలా జక్కన్న తీసిన పది చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి.

9. పద్మశ్రీసినీ రంగంలో తక్కువ వయసులోనే పద్మశ్రీ గౌరవం పొందిన డైరక్టర్ గా రాజమౌళి నిలిచారు. ఈ ఏడాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును తీసుకున్నారు.

10. బాహుబలిబాహుబలి :బిగినింగ్ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రజలను అలరించింది. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు లెక్కలేనన్నీ ప్రాంతీయ అవార్డులను గెలుచుకుంది. తెలుగు చిత్రాల్లో అత్యధికంగా కలక్షన్స్ వసూల్ చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు వందేళ్ల భారతీయ సినిమా అనే అంశంపై ప్రముఖ న్యూస్ ఛానల్ బీబీసీ వారు డాక్యుమెంటరీ తీస్తే అందులో బాహుబలికి చోటు లభించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus