Rajamouli, Mahesh Babu: మహేష్ సినిమాపై మరో క్లారిటీ ఇచ్చిన రాజమౌళి!

ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడిగా కొనసాగుతున్న దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమా తో తన స్థాయిని మరికొంత పెంచుకున్నాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా ప్రేక్షకుల్లో అంచనాలని ఆకాశాన్ని దాటించేస్తోంది. మెగా హీరో రామ్ చరణ్ తేజ్, నందమూరి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మొట్టమొదటి సినిమా సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త ఒరవడిని సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఓవర్సీస్ లో కూడా సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఇక సినిమా ట్రైలర్ కూడా ఇటీవల సినిమా స్థాయిని మరింత పెంచేసింది. దర్శకుడు రాజమౌళి మేకింగ్ ఎలా ఉంటుందో ట్రైలర్ తోనే చెప్పవచ్చు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈజీగా వెయ్యి కోట్లను అందుకుంటుంది అని ప్రేక్షకులకు ఒక అంచనా అయితే ఏర్పడింది. అయితే RRR సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు గత ఏడాదిలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు RRR సినిమా ప్రమోషన్లో భాగంగా మరొకసారి స్పందించారు.

నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తోనే ఉంటుంది అంటూ అయితే ప్రస్తుత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు కూడా మరో సినిమా గురించి ఆలోచించనని RRR సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు సినిమా పై ఫోకస్ పెడతాను అంటూ రాజమౌళి చాలా క్లియర్ గా వివరణ ఇచ్చాడు. తమిళ్ ప్రమోషన్ లో రాజమౌళి ఈ సమాధానం ఇచ్చాడు. ఇక సౌత్ ఇండస్ట్రీ లో ఇప్పటికే రాజమౌళి స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. ఇక ఆయనతో సినిమా చేసే హీరోల స్థాయి కూడా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా అనంతరం అదే తరహాలో పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడతాడు అని చెప్పవచ్చు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus