దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత అంతకుమించి అనేలా ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డి.వి.వి.దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు గా జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇద్దరు చారిత్రాత్మక సమరయోధుల పాత్రల్లో మెగా నందమూరి హీరోలు కలిసి నటించడం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. దానికితోడు బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ గ్లామరస్ హీరోయిన్ అలియా భట్ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తూ ఉండడం మరొక మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
ఇక దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను వీలైనంత ఎక్కువ గ్రాండియర్ గా తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బడ్జెట్ మొదట అనుకున్న దానికంటే ఆ తర్వాత మరింత పెరిగినట్లు రాజమౌళి ఆ తర్వాత క్లారిటీ అయితే ఇచ్చాడు. అయితే ఈ సినిమాకు అందరూ అనుకున్నట్లుగా 450 కోట్లు ఖర్చు అవ్వలేదు అని ఇటీవల మరోసారి రాజమౌళి వివరణ ఇవ్వడంతో అర్థమైపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ మొత్తంగా వచ్చేసి 550 కోట్ల వరకు ఖర్చు అయినట్లుగా దర్శకుడు రాజమౌళి ఇటీవల మీడియాకు తెలియజేశాడు.
ఇక బిజినెస్ ద్వారానే దాదాపు అందులో చాలావరకు రికవరీ అన్నట్లుగా చెప్పుకొచ్చిన రాజమౌళి తప్పకుండా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అని కూడా వివరణ ఇచ్చారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా అయితే ఈ సినిమా దాదాపు 900 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కేవలం దానయ్య మాత్రమే కాకుండా రాజమౌళి కూడా నిర్మాణ భాగంలో పాట్నర్ గా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక హీరోలిద్దరికి కూడా దాదాపు 40 కోట్లకు పైగానే పారితోషికాలు అందినట్లు సమాచారం. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.