Rajamouli: ఆర్ఆర్ఆర్ ప్రచారంలో జక్కన్న ఎత్తుగడ ఇదే?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి భారీ సినిమాలను తెరకెక్కించడంతో పాటు ఆ సినిమాలను భారీస్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. బాహుబలి, బాహుబలి2 సినిమాలు భారీస్థాయిలో సక్సెస్ సాధించడానికి రాజమౌళి కారణమనే సంగతి తెలిసిందే. ఊహించని స్థాయిలో ఆ సినిమాకు ప్రమోషన్స్ నిర్వహించి ఆ సినిమాలు ప్రేక్షకాదరణ పొందడానికి రాజమౌళి కారణమయ్యారు. బాహుబలి2 సినిమాను మించిన బడ్జెట్ తో జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కించారు. 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమా కోసం జక్కన్న అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశారని తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో జక్కన్న ఇప్పటికే భారీస్థాయిలో ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. బాలీవుడ్ టాప్ క్రిటిక్స్ లో కొందరికి రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విజువల్స్ ను చూపించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో బాహుబలిని మించి ఆర్ఆర్ఆర్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి ప్రతి భాషలో అంచనాలు పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటూ భారతీయ సినీ చరిత్రలోనే కొత్త రికార్డులు క్రియేట్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు.

తెలుగులో ఇప్పటికే ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రతి వారం ఏదో ఒక అప్ డేట్ ఉండేలా ఆర్ఆర్ఆర్ టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. చరణ్, తారక్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus