Rajamouli: హాలీవుడ్ ఆఫర్స్ పై రాజమౌళి పర్ఫెక్ట్ ఆన్సర్!

  • December 10, 2021 / 03:07 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువచ్చినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఇక రాబోయే బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ RRR పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతుందని సినీ ప్రముఖులు కూడా భావిస్తున్నారు. అయితే రాజమౌళి కి కొన్ని హాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చినట్లు ఇటీవల అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

రీసెంట్ గా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన రాజమౌళి ఆ విషయం పై వచ్చిన సందేహాలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఇప్పటివరకు తనకు ఎలాంటి హాలీవుడ్ ఆఫర్స్ అయితే రాలేదు అంటూ భవిష్యత్తులో ఇండియా కు సంబంధించిన కథను హాలీవుడ్లో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తెలియజేశాడు.భారతీయ ఆధారాలతో ఉండే కథలను ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ తెరపై చూపించాలని తన కోరిక అంటూ రాజమౌళి ఇచ్చిన వివరణ ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

తప్పకుండా రాజమౌళి హాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయికి ఎదుగుతాడు అని అభిమానులు కూడా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ దర్శకుడి తో సినిమా చేసేందుకు రెడీ గా ఉన్నప్పటికీ రాజమౌళి మాత్రం ఎక్కువగా టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus