Mahesh Babu, Rajamouli: మహేష్ బాబుతో రాజమౌళి.. అసలైన కాంబో స్టార్ట్!

దర్శక ధీరుడు రాజమౌళి మొత్తానికి బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా RRR సినిమాను ఈనెల 25వ తేదీన విడుదల చేయబోతున్నాడు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి మొదటిసారి నటించిన ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయనుంది అని చెబుతున్నారు. అయితే ఈ సినిమా తరువాత రాజమౌళి మహేష్ బాబు బిజీ కాబోతున్నాడు.

మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు గత ఏడాదిలోనే క్లారిటీ ఇచ్చిన దర్శకధీరుడు మధ్యలో చాలాసార్లు సూపర్ స్టార్ తో చర్చించడం జరిగింది. నిర్మాతగా కె.ఎల్.నారాయణ కూడా పలుమార్లు చర్చలు కొనసాగించినట్లు చెప్పాడు. అయితే వీరు కలుసుకున్నట్లు ఇంతవరకు ఇలాంటి ఫోటోలు కూడా విడుదల కాలేదు. రీసెంట్ గా నిర్మాతలతో కలిసి మరోసారి చర్చలు జరిపారు. మొదటిసారి ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు నిర్మాతలు కలుసుకున్న ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది.

ఇక RRR సినిమా పనులు అన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాత గత కొన్ని రోజుల నుంచి మహేష్ బాబు కలవాలి అని రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఫైనల్ గా శుక్రవారం రోజు వీరు ముగ్గురు కలుసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రచయిత కె.విజయేంద్రప్రసాద్ పూర్తి కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాజమౌళి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు.

ఈ సినిమా ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు గత కొంత కాలంగా ఒక టాక్ అయితే వైరల్ గా మారింది. అంతే కాకుండా మరో బాలీవుడ్ హీరో కూడా సినిమాలో నటించబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక సినిమాను కుదిరితే 2024 దసరా సమయానికి భారీ స్థాయిలో విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus