Rajamouli: మహాభారతం సముద్రం లాంటిది..సమయం పడుతుంది!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీరియల్స్ తో ప్రారంభమైన ఈయన ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచం గర్వించేలా సినిమాలను చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటమే కాకుండా, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులను సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.

ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలపై ప్రశంసలు కురిపించారు. సాధారణంగా రాజమౌళి పురాణ ఇతిహాసాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే సినిమాలను తెరకెక్కించడానికి రాజమౌళి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఎప్పటికైనా మహాభారతం సినిమా చేయాలని, ఆ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. తాజాగా మరోసారి ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తెలిపారు. మహాభారతం సినిమా అంటే ఒక సముద్రం లాంటిది.

సముద్రంలోకి దిగాలంటే కాస్త ఆలస్యం అవుతుంది. అందుకే తను మరో రెండు మూడు సినిమాలను చేసిన అనంతరం మహాభారతం సినిమా షూటింగ్ పనులు మొదలు పెడతానని వెల్లడించారు. ఇక రాజమౌళి చెప్పిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ… రాజమౌళి మరో మూడు సినిమాలు చేయాలంటే దాదాపు 10 సంవత్సరాలకు పైగానే పడుతుంది.

ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరపైకి రావడానికి సుమారు పది సంవత్సరాలకు పైగా సమయం పడుతుందని కామెంట్ చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ తో విజయాన్ని అందుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus