RRR Movie Dialogue: ‘ఆర్ఆర్ఆర్’లో ఈ డైలాగ్ విన్నారా..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా రాజమౌళి ఈ సినిమాలో ఓ డైలాగ్ ను రివీల్ చేశారు.

సోమవారం హైదరాబాద్‌లోని ఛాయిస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, దర్శకుడు రాజమౌళి, వైద్యులు రవి తంగరాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. పిల్లల్లో కలిగే 90 శాతం సమస్యలకు పరిష్కారాలున్నాయనీ.. ఛాయిస్ ఫౌండేషన్ పిల్లల కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతుందని చెప్పారు. ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు. అదేంటంటే.. ”నువ్వు చేసేది ధర్మయుద్ధమైతే.. ఆ యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి”.

ఈ డైలాగ్ ఎవరు చెప్పారో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అభిమానులు మాత్రం రాజమౌళి చెప్పిన డైలాగ్ ను సోషల్ మీడియాలో అప్పుడే ట్రెండ్ చేసేస్తున్నారు. సినిమాలో ఇలాంటివి ఇంకెన్ని డైలాగ్స్ ఉంటాయో అని ఆనందపడిపోతున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus