ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఆర్ఆర్ఆర్ టోటల్ బడ్జెట్ 550 కోట్ల రూపాయలు కాగా రెమ్యునరేషన్లు కాకుండా ఈ సినిమా బడ్జెట్ 336 కోట్ల రూపాయలు అని సమాచారం. ఏపీలో టికెట్ రేట్లను పెంచుకోవడానికి ఆర్ఆర్ఆర్ యూనిట్ దరఖాస్తు చేసుకుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. కమిటీ జీవో ప్రకారం టికెట్ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్ని నాని చెప్పుకొచ్చారు.
రెమ్యునరేషన్లు కాకుండా 100 కోట్ల రూపాయల బడ్జెట్ దాటిన సినిమాలకు 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని పేర్ని నాని వెల్లడించారు. టికెట్ రేట్లు పెరిగితే ఆర్ఆర్ఆర్ ఏపీలో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఆర్ఆర్ఆర్ లో ప్రేక్షకుల అంచనాలకు అందని ఎన్నో సర్ప్రైజ్ లు ఉన్నాయని తెలుస్తోంది. జక్కన్న ఈ సినిమా విషయంలో ఊహించని సర్ప్రైజ్ లు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ప్రతి 20 నిమిషాలకు ఒక సర్ప్రైజ్ ఉండే విధంగా జక్కన్న ప్లాన్ చేశారని బోగట్టా. చరణ్, అలియా మధ్య ఒక సాంగ్ ఉంటుందని ఆ సాంగ్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉండనుందని తెలుస్తోంది. సినిమాలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులు సైతం కంటతడి పెట్టే విధంగా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. చరణ్, తారక్ కాంబినేషన్ లో వచ్చే సీన్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని రాజమౌళి కళ్లు చెదిరే విజువల్స్ తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళతారని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ ఏకంగా 3,000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాధేశ్యామ్ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఆర్ఆర్ఆర్ రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తొలిరోజు కలెక్షన్లు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉండే అవకాశాలు ఉన్నాయి.