RRR Movie: ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ కావాలని తారక్ అడిగారా?

మార్చి నెల 25వ తేదీన భారీ అంచనాలతో విడుదలైన ఆర్ఆర్ఆర్ అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ గురించి జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. హిందీలో సైతం ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ గురించి మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని వెల్లడించారు.

Click Here To Watch NOW

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తమ ఇంటికి వచ్చాడని ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి అడిగాడని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ కు సంబంధించి తాను కొన్ని ఐడియాలు చెప్పానని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కు సంబంధించి తాను చెప్పిన ఐడియాలు రాజమౌళికి, జూనియర్ ఎన్టీఆర్ కు బాగా నచ్చాయని దైవానుగ్రహం ఉంటే ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ వస్తుందని ఆయన అన్నారు.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ పూర్తైన తర్వాత ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పట్టాలెక్కుతుందేమో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు చరణ్ ఫ్యాన్స్ కూడా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఫుల్ రన్ లో ఈ సినిమా 1,000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఎన్టీఆర్, చరణ్ లను ఆర్ఆర్ఆర్ నటులుగా మరో మెట్టు పైకి ఎక్కించింది. రాజమౌళి త్వరలో మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ కానున్నారు. ఈ ఏడాది ఎండింగ్ లో మహేష్ సినిమా షూటింగ్ పనులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని జక్కన్న చెప్పుకొచ్చారు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus