Rajamouli: ఆర్.ఆర్.ఆర్ ఓటీటీ పెర్ఫార్మన్స్ పై మొదటిసారి స్పందించిన జక్కన్న..!

4 ఏళ్లుగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ చిత్రాన్ని రాజమౌళి డైరెక్ట్ చేయడంతో ఇంటర్నేషనల్ వైడ్ భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక మే 20 నుండి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

మొదటగా ‘ఆర్.ఆర్.ఆర్’ ను ‘జీ5’ మరియు నెట్ ఫ్లిక్స్ సంస్థలు స్ట్రీమింగ్ చేసాయి. గత 4,5 రోజుల నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది పక్కన పెడితే.. నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘ఆర్.ఆర్.ఆర్’ హిందీ వెర్షన్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తుంది. ఈ విషయం పై రాజమౌళి హర్ట్ అయ్యాడు. తను హర్ట్ అయిన విషయాన్ని రాజమౌళి బహిరంగంగానే బయటపెట్టాడు. ‘ది గ్రే మెన్’ ప్రమోషన్స్ కోసం ఇండియా వచ్చిన రూసో బ్రదర్స్ తో .. రాజమౌళి నెట్ ఫ్లిక్స్ వేదికగా ముచ్చటించాడు.

థియేట్రికల్ గా ఆర్.ఆర్.ఆర్ బ్లాక్ బస్టర్ అయ్యాక ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకుంటూ ఇప్పటికీ ట్రెండింగ్లో నిలుస్తున్న తరుణంలో మీ స్పందన తెలియజేయండి అంటూ వారు రాజమౌళిని కోరగా “ముందుగా నేను నెట్ ఫ్లిక్స్ పై చాలా కోపంగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ‘ఆర్.ఆర్.ఆర్’ హిందీ వెర్షన్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. మిగిలిన 4 భాషలు తీసుకోలేదు. అదొక్కటే నా కంప్లైంట్. కానీ ‘ఆర్ఆర్ఆర్’ కి వచ్చిన రెస్పాన్స్ చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను.

నేనొక మంచి కథ చెప్పాలనుకున్నాను. కానీ.. నెట్‌ఫ్లిక్స్‌ వల్ల అది అన్ని దేశాల ప్రజలకు రీచ్ అయ్యింది. మౌత్ పబ్లిసిటీ వల్ల కూడా చిత్రానికి ఇంత మంచి అప్లాజ్ రావడం సంతోషంగా ఉంది. వివిధ దేశాల్లో ఉన్న మూవీ లవర్స్, క్రిటిక్స్ కూడా మంచి రివ్యూలు ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్ లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదు. ఈ విషయంలో నేను నెట్ ఫ్లిక్స్ ను ఎంతగానో గౌరవిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus