Rajamouli: ముంబయిలో జక్కన్న అలా చెప్పాడేంటి?

టాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఎక్కడికి వెళ్లినా… మీరు తమిళ పరిశ్రమ నుండి వచ్చారా? అని అడుగుతుండేవారు. ఇదే విషయాన్ని చాలామంది తారలు గతంలో చెప్పారు కూడా. అంతెందుకు తెలుగు వాళ్లు ఉత్తారాదిలో తెలుగులో మాట్లాడితే ‘మీరు తమిళా?’ అని అడుగుతారు. అలాంటి సందర్భాల్లో ‘కాదు మాది తెలుగు రాష్ట్రం, మేం తెలుగు వాళ్లం’ అని చెప్పాల్సి వచ్చేది. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి తగ్గిందనే చెప్పొచ్చు. కానీ ముంబయిలో రాజమౌళి చెప్పిన మాట… తిరిగి ఆ జమానాను గుర్తు చేసింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం గురించి… మొత్తం టీమ్‌ ఇటీవల ముంబయి వెళ్లింది. అక్కడ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ‘ఒక్కో లాంగ్వేజ్‌ నుండి ఒక్కో నటుడిని తీసుకున్నారా?’ అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్న వేశారు. దానికి సమాధానం చెబుతూ… రాజమౌళి రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ తమిళ ఇండస్ట్రీకి చెందినవారు అని అన్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ‘తారక్‌, చరణ్‌ను తీసుకున్నది వాళ్లు తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చారని కాదు’ అని అన్నారు. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి.

ఈ మాటలు రాజమౌళి ఎందుకన్నారు అనేది ఆయన చెబితేనే తెలుస్తుంది. పొరపాటున అన్నారా? లేక మొత్తం సౌత్‌ను కలిపి అలా మాట్లాడారా అనేది తెలియడం లేదు. గతంలో ‘మీరు కోలీవుడ్‌ నుండా?’ అనే ప్రశ్న వేస్తే ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు మన దర్శకుడే బాలీవుడ్‌ గడ్డ మీద ఇలా అనడం కాస్త కొరుకుడు పడని విషయమే అని చెప్పాలి. దీనిపై రాజమౌళి ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus