Rajamouli: పాపం మహేష్-రాజమౌళి సినిమా ఇప్పట్లో లేనట్టే..!

మహేష్ అభిమానులు ఎప్పటి నుండో రాజమౌళి తో మా అభిమాన హీరో ఒక్క సినిమా చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు. పదేళ్ల క్రితమే మహేష్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఖరారు అయ్యింది. కానీ అది కార్య రూపం దాల్చడానికి ఇన్ని రోజుల సమయం పట్టింది. ఇప్పటి వరకు స్క్రిప్ట్ పూర్తి స్థాయి లో తయారు కాలేదు. రచయితా విజయేంద్ర ప్రసాద్ ఈ ఏడాది చివరి లోపు పూర్తి చేస్తానని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పాడు.

లెక్క ప్రకారం రేపు మహేష్ బాబు కి (Rajamouli) రాజమౌళి ఫైనల్ స్క్రిప్ట్ న్యారేషన్ ఇవ్వాలి. కానీ ప్రతీ విషయం లో పక్కాగా ఉండే రాజమౌళి, స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత ఇది అసలు సరిపోదు, ఇంకా కొత్తగా ఉండాలి, చాలా సన్నివేశాలు మరో రాసారు రీ రైట్ చెయ్యాల్సిన అవసరం ఉంది అని చెప్పాడట. దీంతో విజయేంద్ర ప్రసాద్ మరో నాలుగు నెలల సమయం అడిగాడట. ఎంత సమయం తీసుకున్న పర్వాలేదు.

ఈ చిత్రం బాహుబలి మరియు ఆర్.ఆర్.ఆర్ స్కేల్ కి పది రెట్లు ఉండబోతుంది, జాగ్రత్తగా చెయ్యాలి అని అన్నాడట. దీంతో మహేష్ రాజమౌళి సినిమా ప్రారంభం కావాలంటే కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది. అప్పటికీ కూడా రాజమోళి సంతృప్తి చెందకపోతే ఇంకా సమయం పట్టే అవకాశం కూడా లేకపోలేదు.

ఇదంతా చూసిన తర్వాత అభిమానులు ఈ చిత్రం ఇక ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఎప్పుడు విడుదల అవుతుందో, అసలు సినిమా ఉంటుందా లేదా అనే డైలమా లో పడిపోయారు. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ చిత్రం లో నటిస్తున్న మహేష్ బాబు, రాజమౌళి తో సినిమా ప్రారంభం అయ్యేలోపు మరో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఏమి అవుతుందో.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus