రాజమౌళి తో మామూలుగా ఉండదు మరి..!

ఇండియన్ లెవెల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకులు ఎవరంటే మనకి టక్కున గుర్తొచ్చే పేర్లు.. శంకర్ మరియు రాజమౌళి. వీళ్ళ డైరెక్షన్లో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తామా అని స్టార్ హీరోలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తారు కానీ.. నిర్మాతలు మాత్రం భయపడుతుంటారు అని ఇండస్ట్రీలో జోకులు వినిపిస్తూ ఉంటాయి. వీళ్ళతో సినిమా నిర్మించడానికి ముందుకు వస్తే.. డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెట్టాలి. కచ్చితంగా ఆ డబ్బు రెండు రేట్లు తిరిగి వస్తుంది అని తెలిసినా… ఖర్చు పెట్టేప్పుడు మాత్రం ఎవ్వరికైనా భయం వేస్తుంది కదా.

అలా అని వీరితో సినిమాలు చేసే అవకాశం వస్తే మాత్రం నిర్మాతలు అస్సలు వెనుకడుగు వెయ్యరు. ఇదిలా ఉండగా… ఇప్పుడు రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా చేస్తున్నాడు కాబట్టి.. నిర్మాత దానయ్యతో విస్తారంగా ఖర్చు పెట్టిస్తున్నాడట. అనుకున్నదాని కంటే ఈ చిత్రం బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’… లాక్ డౌన్ కారణంగా 2 నెలల పాటు షూటింగ్ వాయిదా పడింది. ప్రభుత్వం నుండీ అనుమతులు వచ్చిన వెంటనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

ఇందులో భాగంగా నెక్స్ట్ షెడ్యూల్ కు ఏకంగా 20 కోట్ల తో సెట్ వేయిస్తున్నాడట రాజమౌళి. ఈ సెట్ బడ్జెట్ చూసి నిర్మాత దానయ్య… మతి పోగొట్టుకునేంత కంగారు పడ్డాడని తెలుస్తుంది.అలా అని ఈ సీన్ ఎక్కువ సేపు సినిమాలో ఉండదట. అయినా సరే కీలక సన్నివేశం అని చెప్పి సెట్ వేయిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా రాజమౌళి తో సినిమా అంటే నిర్మాతలకు ఇలాంటి షాక్ లు తప్పవు మరి.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus