Rajamouli: ఆ విమర్శలకు చెక్ పెట్టేసిన రాజమౌళి.. క్లారిటీ వచ్చేసిందిగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో రాజమౌళి (S. S. Rajamouli)  ఒకరు కాగా ఈ దర్శకుడి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే ప్రస్తుతం రాజమౌళి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్ లో కొత్త హీరోతో సినిమా తెరకెక్కుతుందా అనే ప్రశ్నకు సాధారణంగా కాదనే సమాధానం వినిపిస్తుంది. అయితే రాజమౌళి మాత్రం తాను కొత్త హీరోతో సైతం సినిమా చేయడానికి సిద్ధమేనని చెబుతున్నారు.

Rajamouli

కథ డిమాండ్ చేస్తే కొత్త హీరోతో సైతం సినిమా చేస్తానని ఆయన తెలిపారు. తాను కొత్త హీరోతో సినిమా చేయకూడదని లేదని జక్కన్న అన్నారు. సినిమా కథకు అనుగుణంగా హీరోల ఎంపిక ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు. స్క్రిప్ట్ కు కొత్త హీరో అవసరం అనుకుంటే కొత్త హీరోనే తీసుకుంటానని రాజమౌళి తెలిపారు. కొత్త హీరోతో చేయకూడదని చేస్తే రీచ్ ఉండదని తాను పట్టించుకోనని ఆయన అన్నారు.

స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మాత్రం హీరో విషయంలో అస్సలు రాజీ పడనని జక్కన్న తేల్చి చెప్పారు. కొత్త హీరోతో సైతం నన్ను నేను ప్రూవ్ చేసుకోగలనని చెప్పడానికి నేను సినిమా చేయనని రాజమౌళి వెల్లడించారు. కొత్త హీరో నటించి సినిమాలు సక్సెస్ సాధించిన సందర్భాలు ఉన్నాయని రాజమౌళి తెలిపారు. రాజమౌళి గతంలో చిన్న సినిమాలు చేసిన సమయంలో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆ సినిమాలు చేశారని కామెంట్లు వినిపించాయి.

రాజమౌళి మాత్రం ఆ కామెంట్లలో ఏ మాత్రం నిజం లేదని ఈ విధంగా చెప్పకనే చెప్పేశారు. రాజమౌళి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాకు సంబంధించి వర్క్ షాప్ లతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

డౌట్ లేదు.. మంచి కథ మిస్ చేసుకున్న నాగ చైతన్య

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus