Rajamouli, Salman Khan: బాలీవుడ్ హీరోకు జక్కన్న ఓకే చెప్పారా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్నకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రావడం ఖాయమని టాలీవుడ్ స్టార్ హీరోలు భావిస్తున్నారు. ఇతర ఇండస్ట్రీల హీరోలు సైతం జక్కన్న డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్నారు. తన సినిమాల ద్వారా తెలుగు సినిమాలకు రాజమౌళి ప్రపంచస్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టారు. బాహుబలి, బాహుబలి2 సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి.

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్, మహేష్, అల్లు అర్జున్ తో ఒక్క సినిమాను కూడా తెరకెక్కించలేదు. రాజమౌళి తర్వాత సినిమాలో మహేష్ హీరోగా నటించనుండగా పవన్ తో సినిమా తీయలేనని రాజమౌళి గతంలో చెప్పారు. పవన్ జనసేన పార్టీ పనులతో బిజీగా ఉండటంతో పవన్ తో మూవీ సాధ్యం కాదని రాజమౌళి అన్నారు. అల్లు అర్జున్ జక్కన్న కాంబోలో మూవీ వస్తుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.

తాజాగా హిందీ బిగ్ బాస్ షోలో ఆర్ఆర్ఆర్ టీమ్ సందడి చేసింది. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. రాజమౌళితో సినిమా గురించి వస్తున్న వార్తలు ఊహాగానాలని సల్మాన్ ఖాన్ కామెంట్లు చేశారు. రాజమౌళితో కలిసి తాను ఏ సినిమాకు పని చేయడం లేదని సల్మాన్ ఖాన్ కామెంట్లు చేశారు.

భజరంగి భాయిజాన్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల రాజమౌళి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. రాజమౌళి మహేష్ తో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నారు. 2022 సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. రాజమౌళి మహేష్ సినిమా తర్వాత ఎవరితో సినిమాను తెరకెక్కిస్తారో తెలియాల్సి ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus