రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తుండగా దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు ఈ మూవీ కథ, నేపథ్యం ఏమై ఉంటుంది అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. ఐతే రాజమౌళి చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను వారి జీవితాలలో జరిగిన సంఘటనలు స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే అనేక మార్లు చెప్పారు. అలాగే ఈ చిత్రంలో దేశభక్తి కూడా ఉందని తెలియజేయడం జరిగింది.
చరిత్రలో గొప్ప వీరులుగా, ప్రజలకోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఇద్దరు వీరుల కథకు నచ్చినట్లుగా మసాలా జోడించి తెరకెక్కిస్తే సామాజిక వాదులు ఊరుకుంటారా అనేది ఇక్కడ సమస్య.. ముఖ్యంగా సామాజిక వాదులు మరియు చరిత్రకారులు ఆర్ ఆర్ ఆర్ సినిమాని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం. ఒక వేళ వారి ఉద్యమం సక్సెస్ అయితే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ మరియు చరణ్ ల పాత్రల పేర్లుగా ఉన్న భీమ్, అల్లూరి మార్చవలసిన అవసరం ఏర్పడినా ఆశ్చర్యం లేదు.
కాబట్టి ఇది రాజమౌళికి పెను సవాలే అని చెప్పాలి. రాజమౌళి ఇవ్వన్నీ ఆలోచించే టైటిల్ కూడా ఆర్ ఆర్ ఆర్ నిర్ణయించి ఉంటారని అర్థం అవుతుంది. సినిమా విడుదల అయ్యే వరకు సినిమా కంటెంట్ పై కోర్ట్ కి వెళ్ళడానికి, విడుదల వాయిదా వేయడానికి ఎక్కువ అవకాశం ఉండదు. టైటిల్ ఐతే ప్రత్యర్ధులు గెలిస్తే విడుదలకు ముందే మార్చవలసిన సందర్భం కూడా ఉంటుంది. అందుకే రాజమౌళి ఆలోచించి ఈ టైటిల్ పెట్టి ఉంటారు.