సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) స్టార్ డైరెక్టర్ రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూట్ అంతకంతకూ ఆలస్యమవుతున్నా రాజమౌళి ఒక సినిమా కోసం ఇంత సమయం కేటాయిస్తున్నారంటే కచ్చితంగా సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం జర్మనీ దేశంలో మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ జరగనుంది. ఈ సినిమా 225 సంవత్సరాల క్రితం కథతో తెరకెక్కుతోందని అరుదైన గిరిజన తెగకు సంబంధించిన కథతో ఈ సినిమాను ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది.
ఈ సినిమాలో మహేష్ పాత్ర మరింత స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో హాలీవుడ్ నటులకు స్కోప్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ మరో మూడు నెలల్లో మొదలుకానుందని విదేశాల్లో షూట్ జరగనుండటంతో వీసాల ఆధారంగా షూటింగ్ షెడ్యూల్ లో మార్పులు ఉండనున్నాయని తెలుస్తోంది.
అరుదైన గిరిజన తెగకు సంబంధించిన కథ అంటూ వస్తున్న వార్తలు అంచనాలను పెంచేస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ ఈ సినిమా విడుదలయ్యే వరకు తన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేయవద్దని సూచించారని కూడా వార్తలు వినిపించాయి. జక్కన్న మూవీతో మహేష్ బాబు సాధించే రికార్డులు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
ఈ సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఈ సినిమా షూట్ ఆలస్యమయ్యే కొద్దీ ఈ సినిమా బడ్జెట్ సైతం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు సైతం ఒకింత ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం.