2020 లోనే మల్టీ స్టారర్ మూవీ రానుందా?

తెలుగు దర్శకులందరిదీ ఒక రూట్ అయితే.. రాజమౌళి ది మరో రూటు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత మాదిరిగా చిన్న హీరోలతో సినిమాలు తీసినా రెండేళ్లు సమయం తీసుకుంటారు జక్కన్న.   మరి స్టార్ హీరోలతో సినిమా చెయ్యాలంటే తప్పకుండా రెండేళ్లు పడుతుంది. బాహుబలి తర్వాత రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. తాజా సమాచారం మేరకు డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ మూవీ అక్టోబర్ లో పూజ కార్యక్రమాలు జరుపుకొని నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలిసింది.

ఇక పూర్తి అయ్యే డేట్ అనేది రాజమౌళి సినిమాల విషయంలో కరక్ట్ గా చెప్పలేము. కానీ గచ్చిబౌలీలోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంతంలో సెట్స్ వేయడానికి  అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని రెండు సంవత్సరాలపాటు లీజ్ కి తీసుకున్నట్టుగా తెలిసింది. అంటే ఈ సినిమా షూటింగ్ రెండేళ్లు సాగనున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. బాహుబలికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పర్యవేక్షణలో అక్కడ నిర్మాణ డిజైన్స్ మొదలయ్యాయి. షూటింగ్ రెండేళ్లు పడితే పోస్ట్ ప్రొడక్షన్ కి మరో ఆరు నెలలు సమయం పడుతుంది. సో 2020 చివర్లోనే ఈ చిత్రం థియేటర్లోకి రావచ్చని తెలుగు సినీ ట్రేడ్ వర్గాల వారు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus