రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తరువాత మహేష్ తో మూవీ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. అది ఆయన చేసిన అధికారిక ప్రకటన కాదు. ఓ ఇంటర్వ్యూలో మహేష్ మూవీ గురించి అడుగగా నెక్స్ట్ మహేష్ మూవీ అయ్యే అవకాశం కలదు అన్నారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత మహేష్ బాబుతోనే కదా అని అడిగిన దానికి కూడా ఆయన ప్లాన్ అయితే అదే అన్నారు. ఐతే ఈ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ కానీ, కథ కానీ రెడీ కాలేదు అని చెప్పడం గమనార్హం. మహేష్ మూవీకి ఓ కథను సిద్ధం చేయాలి అన్నారు.
రాజమౌళి చెప్పినట్లుగా ముందుగా మహేష్ సినిమాకు ప్లాన్ ఉంటే అసలు కథ కూడా రెడీగా లేకపోవడం ఏమిటీ? అందులోను రాజమౌళి… మహేష్ మూవీ బాహుబలి కంటే ముందే రావలసింది అన్నారు. మరి ఇన్నేళ్ళుగా మహేష్ కోసం ఒక కథ లేకుండానే మూవీ అనుకున్నారా అనే సందేహం కలుగుతుంది. మరో వైపు రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టాలి, కొన్ని ఐడియాస్ కూడా డెవలప్ చేస్తున్నాను అని చెవుతున్నారు. ఇవన్నీ గమనిస్తుంటే ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి మహేష్ తో మూవీ చేస్తాడా లేదా అనే అనుమానం కలుగుతుంది.
మహేష్ తోమూవీ మొదలుపెడితే మరో ఐదేళ్ల వరకు మహాభారతం మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళలేరు. అలా మొత్తంగా చూసుకున్నా రాజమౌళి మహాభారతాన్ని థియేటర్స్ లోకి తెచ్చే నాటికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి మహేష్ మూవీని పక్కన బెట్టి తన డ్రీం ప్రాజెక్ట్ ని మొదలుపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక మహాభారత అనేక మంది స్టార్ హీరోలతో తెరకెక్కే మల్టీస్టారర్ కాబట్టి అందులో మహేష్ ఓ కీలక రోల్ చేసే అవకాశం కలదు.