Rajamouli: జక్కన్న జాగ్రత్తలు మామూలుగా లేవుగా!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు రెండు నెలల సమయం ఉన్నా సినిమాకు సంబంధించిన కీలక విషయాలు లీకవుతున్నాయి.

కొన్ని నెలల క్రితం ఈ సినిమా నుంచి ఎన్టీఆర్, చరణ్ లకు సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచడంతో పాటు స్టార్ హీరోలకు, టెక్నీషియన్లకు ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం లీక్ కాకూడదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. షూటింగ్ పూర్తైన తర్వాత రాజమౌళి ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగుతారని సమాచారం. అయితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా జరగవని తెలుస్తోంది.

సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచి సినిమా రిలీజయ్యే నాటికి అంచనాలు మరింత భారీగా పెరిగేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సినిమా రిలీజ్ కు నెలరోజుల ముందు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. కథ విషయంలో పరోక్షంగా హింట్స్ ఇచ్చిన జక్కన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఏ స్థాయి బ్లాక్ బస్టర్ ను తీస్తారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus