‘ఆర్ఆర్ఆర్’ టీజర్.. పలు గెటప్పుల్లో ఎన్టీఆర్!

బాహుబలి-2 తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన 70 శాతం షూటింగ్ పూర్తి కాగా.. కరోనా కారణంగా మిగిలిన పార్ట్ వాయిదా పడింది. సుమారు ఏడు నెలల తర్వాత మళ్లీ తిరిగి షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రామ్ చరణ్ పాత్రకి సంబంధించిన టీజర్ ని వదిలారు. ఈ వీడియోకి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ రామ్ చరణ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయనున్నారు. అక్టోబర్ 22న ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికోసం కొద్దిరోజుల క్రితం ప్రత్యేకంగా షూటింగ్ మొదలుపెట్టారు. ఇంతకీ ఈ వీడియో ఎలా వుండబోతుందనే దానిపై ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో ఎన్టీఆర్ ని పలు గెటప్పుల్లో చూపిస్తారని తెలుస్తోంది. ఓ మామూలు స్థాయి వ్యక్తి నుండి ఉద్యమకారుడైన కొమరం భీమ్ గా మరీనా వైనాన్ని రకరకాల గెటప్పుల్లో చూపిస్తారని తెలుస్తోంది.

ఆరంభంలో షరాయి-లాల్చీతో ఉన్న ఎన్టీఆర్ ని చూపిస్తూ.. చివరికి తలకు పాగా చుట్టుకున్న గెటప్ తో టీజర్ ముగుస్తుందని సమాచారం. టీజర్ లో కనిపించే గెటప్పులన్నీ కూడా అభిమానులను ఆకట్టుకునేలా చిత్రీకరించారని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఈ టీజర్ రికార్డులు సృష్టించడం ఖాయం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటిస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus