‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో జక్కన్న షాకింగ్ డెసిషన్?

దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ (1&2) తరువాత తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, చరణ్ వంటి బడా హీరోలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రాజమౌళి… చరిత్రలో ఎప్పుడూ కలుసుకోని అల్లూరి సీతారామరాజు అలాగే కొమరంభీం లను .. స్క్రీన్ పై కలిపి చూపించాడనికి రెడీ అయ్యాడు. అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఉన్న ఈ చిత్రం విషయంలో రాజమౌళి షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట.

అదేమిటంటే.. ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ కు సంబంధించి రషెస్ చూసాడంట జక్కన్న. అయితే వాటిలో క్లారిటీ మిస్సయ్యింది.. అలాగే క్వాలిటీ కూడా అనుకున్నట్టు రాలేదని ఫీలవుతున్నాడట. సో రాజమౌళి సంతృప్తి చెందలేదన్న మాట. దీంతో కొన్ని ఎపిసోడ్ లు మళ్ళీ రీ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇది కొత్తేమీ కాదు.. రాజమౌళి సినిమా అంటే ఇలాంటివి ‘ఎక్స్పెక్టెడే’ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ చిత్రాన్ని అనుకున్న డేట్ ప్రకారం అంటే.. జూలై 30 2020 కి విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి..!

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus