Rajanikanth, Pawan Kalyan: పవన్ గురించి రజనీ చేసిన కామెంట్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్నారు. పవన్ సినిమాలకు దూరంగా ఉన్నా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదనే సంగతి తెలిసిందే. పవన్ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన తరపున ప్రచారం చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. పొలిటికల్ గా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని పవన్ ఫీలవుతున్నారు. అయితే రజనీకాంత్ (Rajinikanth) పవన్ గురించి గతంలో ఒక సందర్భంలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కథానాయకుడు సినిమాలో సునీల్ (Sunil) కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ ఒక సందర్భంలో జల్సా (Jalsa) మూవీ గురించి రజనీతో మాట్లాడుతూ ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) తన స్నేహితుడు అని చెప్పారట. ఆ సమయంలో రజనీకాంత్ త్రివిక్రమ్ తనకు తెలుసని బదులిచ్చారట. జల్సాలో పవన్ హీరోగా చేస్తున్నారని చెప్పగా “తెలుగులో నెక్స్ట్ సూపర్ స్టార్ ఇతనే” అని రజనీకాంత్ బదులిచ్చారట.

జల్సా సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే తర్వాత రోజుల్లో పవన్ వరుస విజయాలతో తన రేంజ్ ను పెంచుకున్నారు. పవన్ మార్కెట్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు సులువుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. పవన్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తే మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

పవన్ కళ్యాణ్ గురించి ఇతర స్టార్ హీరోల మనస్సులో ఎలాంటి స్థానం ఉందో తెలియటానికి రజనీకాంత్ మాటలే సాక్ష్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ (OG Movie) , ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) 3 నెలల గ్యాప్ తో థియేటర్లలో రిలీజ్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus