Jailer Movie: జైలర్ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో రజనీ మార్కెట్ పెరిగినట్టేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 300 కోట్ల రూపాయల కలెక్షన్ల క్లబ్బులో చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం మూడంటే మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు 32 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రజనీకాంత్ గత సినిమాలు ఫ్లాపైనా జైలర్ మాత్రం అంచనాలను మించి హిట్టైంది.

ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు అంచనాలకు మించి లాభాలు వచ్చాయి. జైలర్ సక్సెస్ తో రజనీకాంత్ కు పూర్వ వైభవం వచ్చినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో జైలర్ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. గతేడాది విక్రమ్ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందుకోగా ప్రస్తుతం జైలర్ మూవీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తోంది.

72 సంవత్సరాల వయస్సులో రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సన్ పిక్చర్స్ నిర్మాతలు ఈ సినిమా సక్సెస్ తో సంతోషంగా ఉన్నారు.

జైలర్ (Jailer Movie) సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జైలర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. జైలర్ సినిమా సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియాల్సి ఉంది. రజనీకాంత్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రజనీకాంత్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus