Rajasekhar: నెల రోజులు ఐసీయూలోనే.. కన్నీళ్లు పెట్టుకున్న జీవిత!

టాలీవుడ్ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన రాజశేఖర్.. ఇప్పటికీ నటుడిగా అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ‘శేఖర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఆయనకు కరోనా సోకి నెలరోజుల పాటు హాస్పిటల్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటిరోజులను గుర్తుచేసుకున్నారు ఈ హీరో. తాజాగా తన భార్య జీవితతో కలిసి అలీతో సరదాగా షోకి గెస్ట్ గా వచ్చారు రాజశేఖర్. దీనికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. అందులో రాజశేఖర్, జీవిత ఎన్నో విషయాలను పంచుకున్నారు.

రాజశేఖర్ డాక్టర్ చదివినా.. ఫైనల్ గా యాక్టర్ అయ్యారు. అసలు యాక్టర్ ఎందుకు అవ్వాలనిపించిందని అలీ అడగ్గా.. ‘ఎప్పుడు ఎగ్జామ్స్ కోసం చదువుతానో… అప్పుడు యాక్టర్ అవ్వాలని ఎక్కువ అనిపించేది’ అని అన్నారు. కానీ తనకు నత్తి ఉండడంతో.. ఏ దర్శకుడినో, నిర్మాతనో కలిసి నాకు అవకాశం ఇవ్వమని అడిగిన తర్వాత, నత్తి వల్ల తీసేస్తే… చాలా అసహ్యం అయిపోతుందేనని ఆలోచించానంటూ నవ్వుతూ చెప్పారు. ఇక ‘శేఖర్’ సినిమాకు జీవిత ఎందుకు దర్శకత్వం వహించాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.

‘శేఖర్’ సినిమా షూటింగ్ మొదలుకాబోతోందనే వారం ముందే రాజశేఖర్ కరోనా బారిన పడ్డారంటూ జీవిత ఎమోషనల్ అయింది. నెల రోజుల పాటు ఆయన ఐసీయూలోనే ఉన్నారని.. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉండేదో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘సీరియస్ అయి మనం చచ్చిపోతాం.. రేపో ఎళ్లుండో మనల్ని మంట పెట్టేస్తారు అని అనుకున్నాను’ అంటూ రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus