Rajeev Kanakala: అలా చెబితే మాత్రం కోపమొస్తుంది.. రాజీవ్ కనకాల కామెంట్స్ వైరల్!

  • January 5, 2024 / 04:35 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో రాజీవ్ కనకాల ఒకరనే సంగతి తెలిసిందే. ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించిన రాజీవ్ కనకాల ఆ సినిమాలతో కమర్షియల్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులలో రాజీవ్ కనకాల ఒకరనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో రాజీవ్ కనకాల బరువు పెరగగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

అయితే తాను లావుగా కనిపించడం వెనుక అసలు విషయాలను రాజీవ్ కనకాల పంచుకున్నారు. ఆ మధ్య నాకు ఫుడ్ పాయిజన్ అయిందని ఆస్పత్రికి వెళితే సెలైన్ ఎక్కించారని రాజీవ్ కనకాల తెలిపారు. యాంటి బయోటిక్స్ కూడా ఇచ్చారని ఆయన అన్నారు. ఆస్పత్రిలో ఫుడ్ ఇచ్చేవారని అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం వచ్చేదని ఫుడ్ వేస్ట్ చేయకూడదని అంతా తినేసేవాడినని ఆయన కామెంట్లు చేశారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రతిరోజూ రాత్రి పావుకిలో నుంచి అరకిలో వరకు స్వీట్లు తినేవాడినని రాజీవ్ కనకాల వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా క్రికెట్ ఆడానని ఆ సమయంలో కాలు బెణికిందని ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో లావు పెరగడం వల్ల సరిగ్గా నడవడానికి కూడా ఇబ్బందులు పడ్డానని రాజీవ్ కనకాల పేర్కొన్నారు. నేను తినే సమయంలో ఎవరైనా చాలు ఆపేయమని చెబితే కోపం వస్తుందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

అందువల్ల నేను తినే సమయంలో ఎవరూ అడ్డు చెప్పరని ఆయన అన్నారు. ప్రస్తుతం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు. రాజీవ్ కనకాల రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. రాజీవ్ కనకాలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. రాజీవ్ కనకాల (Rajeev Kanakala) కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus