Rajeev Kanakala, Suma: సుమ ఫోటోలపై అలా రియాక్ట్ అయిన రాజీవ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమా కనకాల ఒకరు. ఈమె పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అలాగే సీరియల్స్ కూడా చేశారు కానీ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ అందరిని ఆట పట్టిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక సుమ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుందనే సంగతి తెలిసిందే

ఇక ఈమె ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న ఎంతో పద్ధతిగా ఉంటారు అయితే ఇటీవల కాలంలో సుమ కాస్త తన స్టైల్ కూడా మార్చి పెద్ద ఎత్తున మోడ్రన్ డ్రెస్సులను ధరించి ఫోటోషూట్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన కుమారుడు రోషన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నటువంటి తరుణంలో సుమ భారీ స్థాయిలోనే తన కొడుకుని ప్రమోట్ చేయడం కోసం కష్టపడ్డారు.

ఈ క్రమంలోనే ఇటీవల తన కొడుకు సినిమా పేరు ఉన్నటువంటి ఒక నెట్ టీ షర్ట్ ధరించి ఈమె ఫోటోషూట్ చేయించిన సంగతి మనకు తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ఈ ఫోటోషూట్ కి సంబంధించిన వీడియోని సుమ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఇలా సుమ ఫోటోలకు ఫోజులిస్తూ ఉండగా పక్కనే ఉన్నటువంటి తన భర్త రాజీవ్ (Rajeev Kanakala) షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.

సుమ గ్లామరస్ ఫోటోషూట్లను నిర్వహించగా ఆ ఫోటోషూట్స్ చూస్తూ రాజీవ్ కనకాల వామ్మో.. వాయ్యో అని వణికిపోతున్నట్లు ఇచ్చిన రియాక్షన్ నవ్వు తెప్పించింది. నెటిజన్లు మాత్రం రాజీవ్ రియాక్షన్ సూపర్.. రాజీవ్ గారు మాకు కాళ్లు.. చేతులు వణుకుతున్నాయ్ అంటూ సరదాగా ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సుమ తన కొడుకును హైలైట్ చేయడం కోసం భారీగానే కష్టపడ్డారని చెప్పాలి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus