Rajendra Prasad: ఎన్టీఆర్ గొప్పదనం చెప్పిన రాజేంద్ర ప్రసాద్.. ఏం జరిగిందంటే?

  • May 29, 2023 / 01:50 PM IST

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలలో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ బ్రతికి ఉంటే ఆయనకు బంగారు పూలతో పూజ చేసేవాడినని రాజేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ నాకు గురువు, దైవం అని ఆయన తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ ఎన్టీఆర్ సహాయం పొందారని ఆయన చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్లు అని చెప్పేవారని అదే సమయంలో ప్రజలను దేవుళ్లలా చూసేవారని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా కులం గురించి ప్రస్తావిస్తే సీనియర్ ఎన్టీఆర్ కు కోపం వచ్చేదని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. సీనియర్ శతజయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నివాళులు అర్పిస్తుంటే సంతోషంగా ఉందని ఆయన కామెంట్లు చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ మనందరి వాడు అని ఆయన గొప్పదనం భావితరాలకు చెప్పాలని (Rajendra Prasad) రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజేంద్ర ప్రసాద్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలు తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో, సినిమాలలో సాధించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. తన నటనతో ఆయన ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మరణించి చాలా సంవత్సరాలే అయినా జ్ఞాపకాల రూపంలో ఆయన జీవించి ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకు పరిమితంగా పారితోషికం తీసుకున్నారు. నిర్మాతల శ్రేయస్సు గురించి ఎన్టీఆర్ ఎక్కువగా ఆలోచించేవారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus